తెలుగుదేశం పార్టీ ఎంపీలు చట్టబద్ధంగానే భాజపాలో చేరారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమర్ధించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా ఎంపీలు భాజపాలో చేరుతున్నట్లు తీర్మానం చేసి సమాచారం ఇచ్చారన్న కిషన్‌రెడ్డి... తీర్మానం చేశాక అమిత్ షా, రాజ్యసభ ఛైర్మన్‌కు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఎంపీల చేరికపై భాజపాలో చర్చించి ఆమోదించారని స్పష్టం చేశారు.
చట్టపరంగా అన్ని నిబంధనలకు అనుగుణంగానే చేరారన్న కిషన్‌రెడ్డి... 10వ షెడ్యూల్ ప్రకారం రాజ్యసభలో 16 సార్లు విలీనాలు జరిగిన విషయం గుర్తుచేశారు. రాజ్యసభ ఛైర్మన్ చట్ట ప్రకారమే వ్యవహరించారని చెప్పుకొచ్చారు. భాజపాలో చేరిన ఎంపీలపై కేసులు లేవు, ఛార్జిషీట్‌లు లేవన్న కేంద్రమంత్రి... ఆరోపణలపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో వారిపై ఆరోపణలే ఉన్నాయన్నారు.