ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నానీ ఇకనైనా మారు.. విజయసాయీ నువ్వే మారు! - కేశినేని నాని

తెదేపా, వైకాపా ఎంపీలు.. కేశినేని నాని, విజయసాయి మధ్య సామాజిక మాధ్యామాల్లో వాగ్యుద్ధం నడుస్తోంది. నువ్వు మారాలంటే.. నువ్వే మారాలంటూ ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకునే వరకూ వ్యవహారం ముదిరింది.

social war

By

Published : Jun 30, 2019, 3:04 PM IST

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సామాజిక మాధ్యమాల్లో వాగ్యుద్ధం కొనసాగుతోంది. తెదేపా ఎంపీ కేశినేని నాని చేసిన విమర్శలపై.. వైకాపా ఎంపీ విజయసాయి ట్విటర్ లో ప్రతి విమర్శలు చేశారు. ''మీ అధినేత బీజేపీని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి.. యూ టర్న్ తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలా?'' అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎంతో చంద్రబాబు ఘర్షణ వైఖరి అవలంబిస్తే తామూ అదే చేయాలా అని అడిగారు. యుద్దం ఎప్పుడు చేయాలో.. సామరస్యంగా ఎప్పుడు మెలగాలో సీఎం జగన్​కు తెలుసని.. ఇకనైనా మారాలని కేశినేని నానికి.. సాయిరెడ్డి హితవు పలికారు.
కేశినేని నాని పోస్ట్

విజయసాయి ట్వీట్​పై.. నాని తీవ్రంగా స్పందించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్ ఉన్న వాళ్ళు మారాలని హితవు పలికారు. అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి బెయిలుపై బయట తిరుగుతున్న వాళ్ళు మారాలని కౌెంటర్ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details