సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్, స్టాలిన్ - ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు.. రాజకీయ ప్రముఖులు విజయవాడ తరలిరానున్నారు.
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా.. వైకాపా శాసనసభాపక్ష నేత జగన్.. గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకోనున్న కేసీఆర్.. 11 గంటల 25 నిముషాలకు గేట్ వే హోటల్ కు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటల 8 నిముషాలకు ఇందిరాగాంధీ మైదానం చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. గన్నవరం నుంచి దిల్లీ వెళ్తారు. మరోవైపు.. తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సైతం... జగన్ ప్రమాణ స్వీకారానికి రావడం.. ఖరారైంది.