నేషన్ ఫస్ట్ అన్న ప్రధానికి.. గుజరాత్ తప్ప ఆంధ్రప్రదేశ్ కనిపించట్లేదా అని మంత్రి కిమిడి కళావెంకట్రావ్ ప్రశ్నించారు. ప్రధానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
kalavenkatrao
By
Published : Feb 27, 2019, 9:31 PM IST
కళావెంకట్రావ్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్ బహిరంగ లేఖ రాశారు. ప్రధానిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా మాటల కోటలు దాటాయి కానీ చేతలు గడప దాటలేదని ఎద్దేవా చేశారు. స్కాం ఆంధ్ర వద్దని చెప్పిన మోదీనే కుంభకోణాలుచేసిన వారికి వత్తాసు పాడుతున్నారని ఆరోపించారు. నేషన్ ఫస్ట్ అని చెప్పిన ప్రధానికి.. గుజరాత్ మాత్రమే కనిపిస్తోందా అని నిలదీశారు.