ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ చౌకీదార్ కాదు... ఏపీకీ బాకీదార్! - కళా వెంకట్రావు

ప్రధాని మోదీ చౌకీదార్ కాదు.. ఏపీకి బాకీదారు అని విమర్శిస్తూ.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు.

ప్రధాని మోదీకి కళా వెంకట్రావు బహిరంగ లేఖ

By

Published : Mar 29, 2019, 9:35 PM IST

ప్రధాని మోదీకి కళా వెంకట్రావు బహిరంగ లేఖ
ప్రధాని మోదీకి రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. మోదీ చౌకీదార్ కాదు.. ఏపీకి బాకీదార్ అని కళా విమర్శించారు. ఏపీ ప్రజలకు హోదా, మెట్రో రైల్‌, కడప స్టీల్‌ప్లాంట్ లాంటి హామీలు ఎన్నో బాకీ పడ్డారన్నారు. ''మీ కాళ్ల వద్ద ఉండేందుకు మాది అవినీతి కేసుల్లో మునిగిన వైకాపా కాదు'' అన్నారు.తెలంగాణకు రూ.వేల కోట్లు కేటాయించి... ఏపీకి ఎందుకు మొండిచేయి చూపారో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా ఏం ఇచ్చారన్న విషయంపైమోదీ లెక్క చెప్పాలని ప్రశ్నించారు. 12 కేసులున్న నిందితుడికి భాజపా కార్యాలయంలో సపర్యలు చేస్తున్నారని కళా ఆరోపించారు. ''అడిగిన వెంటనే బదిలీలు, అడక్కముందే సూట్‌కేసులు జగన్‌కు పంపుతున్నారు. అధికారంలోకి వచ్చేవరకు ఆడ్వాణీకి దండాలు పెట్టి ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు'' అని కళా విమర్శించారు.

ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details