ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నపూర్ణలాంటి ఆంధ్రాను ఎడారిగా మారుస్తారా?! - kala venkat rao

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి అన్నపూర్ణ లాంటి ఏపీని ఎడారిగా మారుస్తారా అని వైకాపా నేత జగన్​ను కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆస్తుల పరిరక్షణ, కేసుల నుంచి విముక్తి పొందడమే లక్ష్యంగా జగన్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు

By

Published : Apr 2, 2019, 9:29 PM IST

Updated : Apr 2, 2019, 11:23 PM IST

బహిరంగ లేఖ
బహిరంగ లేఖ
బహిరంగ లేఖ
వైకాపా అధినేత జగన్‌కు తెదేపారాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ తో కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్​పై ఆరోపణలు చేశారు. ఆస్తుల పరిరక్షణ, కేసుల నుంచి విముక్తి పొందడమే జగన్ ఉద్దేశ్యమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో కలిసి ఇక్కడ పంటలు, పరిశ్రమలను నాశనం చేసి అన్నపూర్ణలాంటి ఏపీని ఎడారిగా మారుస్తారా అని ప్రశ్నించారు. కృష్ణాపై 5, గోదావరిపై 3 ప్రాజెక్ట్​లను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోందని కళా వెంకట్రావు ఆరోపించారు. వాటి నిర్మాణాల్లో వైకాపా నేతలు కాంట్రాక్టులు పొందలేదా అని ప్రశ్నించారు. పోలవరంపై కేసీఆర్‌ కుట్రలు జగన్‌కు కనిపించడం లేదా అని నిలదీశారు. ఎన్నికల వేళ కేటీఆర్, తెరాస నేతలను కలవడంలో... ఆంతర్యం ఏమిటో జగన్చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Last Updated : Apr 2, 2019, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details