తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆరే స్వయంగా విజయవాడకు వచ్చి జగన్‌ను ఆహ్వానించనున్నారు. ముందు నుంచి జగన్తో కేసీఆర్ స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికీ కేసీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా జగన్ - CHIEF GUEST JAGAN FOR KALESHWARAM OPENING
తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారైంది. అట్టహాసంగా నిర్వహించనున్న ఈ బృహత్కార్యానికి సీఎం జగన్మోహన్రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
జగన్తో కేసీఆర్
Last Updated : Jun 12, 2019, 5:00 PM IST