ఓ వైపు ఎన్నికల వేడి తాకుతుంటే...తనదైన శైలిలో సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రచారంలో ఆయన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో డ్యాన్స్‌లు కూడా చేయించారు. ఎన్నికలు అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా చేప్పేశాయి. ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్‌పోల్స్‌లోనూ... ఫలితాల్లోనూ...ఆయన పేరు లేకపోవడం గమనార్హం.
ట్రెండింగ్ కేఏ పాల్...ఎక్కడ? - జనసేన ప్లాఫ్ షో
ఎవరు ఔనన్నా..కాదన్న...ఎన్నికల సమయంలో అందరి నోట్లో నానిన పేరు కే.ఏ పాల్.. మంచో..చెడో... మీడియా..సోషల్ మీడియాలో పాల్ పేరు రచ్చ రచ్చ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన...ఈసారి ఎన్నికల్లో దిగి...కాబోయే ముఖ్యమంత్రిని తనేనంటూ అందరిచూపు తనవైపు తిప్పుకున్నారు. ఇంతకీ ఆయన పార్టీకేమైందీ?
![ట్రెండింగ్ కేఏ పాల్...ఎక్కడ?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3367026-378-3367026-1558623491718.jpg)
ఏపీ పోలిటికల్ హీట్‌ను కొంతవరకు కూల్ చేసింది కేఏ పాల్ అనే చెప్పవచ్చు. ఎన్నికల వేళ దాదాపు నెలన్నరపాటు కేఏ పాల్ ఏం చేసినా ట్రెండింగే. ఏపీకి తాను సీఎం అవుతానని...ప్రజాశాంతి ఎమ్మెల్యేను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఆఫర్ చేశారు. కొన్ని సమయాల్లో చంద్రబాబు, జగన్, పవన్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. జనసేన పార్టీని తమతో కలిపి పోటీ చేయాలని హితవు పలికారు పాల్.
ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా ..పాల్ తన పార్టీపై నమ్మకంతోనే ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. 30 స్థానాలు తమవేననని నమ్మకంగా చెప్పారు. చివరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాటలే నిజమయ్యాయి.