జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ప్రస్థానం...
1943లో హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేటలో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జన్మించారు. 1991లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2001లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా... 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల సంఘం తొలి ఛైర్మన్‌గా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా పనిచేసిన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి... ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించారు.
ప్రముఖుల సంతాపం...
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా అధ్యక్షుడు జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సుభాషణ్‌రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని... జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతిపట్ల పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు.