జగన్ కేసులో మరో అధికారికి ఊరట - jagan caselo maro adhikari urata
జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది.

జగన్ అక్రమాస్తుల కేసులో మరో ఐఏఎస్ అధికారికి హైకోర్టులో ఊరట లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌పై సీబీఐ కేసును తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వైఎస్ హయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన ఆదిత్యనాథ్ దాస్... ఇండియా సిమెంట్స్‌కు లబ్ధి చేకూర్చారనేది సీబీఐ అభియోగం. ప్రతిఫలంగా ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్... జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని తెలిపింది. ఆదిత్యనాథ్ దాస్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ప్రాసిక్యూషన్‌కు అనుమతి లేకుండా ఛార్జి షీట్ దాఖలు చేయడాన్ని చట్ట విరుద్ధమన్న దాస్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అభియోగపత్రాన్ని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడాన్ని తప్పుపట్టింది. ఇదే కారణంతో ఇటీవల ఆదిత్యనాథ్ దాస్‌పై ఈడీ కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.