ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన వాణిని వినిపిస్తా: ఎమ్మెల్యే వరప్రసాద్ - janasena mla reaction after oath

అసెంబ్లీలో జనసేన వాణిని బలంగా వినిపిస్తానని  ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.

జనసేన వాణిని వినిపిస్తా:ఎమ్మెల్యే వరప్రసాద్

By

Published : Jun 12, 2019, 8:14 PM IST

జనసేన వాణిని వినిపిస్తా:ఎమ్మెల్యే వరప్రసాద్

శాసనసభలో జనసేన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన... వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని... ఇపుడు ఆయన కుమారుడు సీఎంగా ఉన్నప్పుడు మరోసారి శాసనసభలో అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. జనసేన వాణిని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఏమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజా అనుకూల నిర్ణయాలకు మద్దతిస్తామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details