ఒకే ఒక్కడి ప్రమాణ స్వీకారం అయిపోయింది! - రాజోలు
జనసేన ఒక్కగానొక ఎమ్మెల్యే...రాపాక వరప్రసాద్ రావు శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం జగన్తో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌ను కలిశానని తెలిపారు.
janasena_mla_rapaka_vara_prasad_swearing
అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. జనసేన పార్టీ తరఫున ఒకే ఒక్క శాసన సభ్యుడిగా రాపాక ప్రమాణ స్వీకారం చేశారు. మెుదట్లో రాపాక పార్టీ మారుతారని పుకార్లు వచ్చాయి. వైకాపాలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. తాను జనసేనలోనే ఉంటానని వరప్రసాద్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు.
Last Updated : Jun 12, 2019, 7:14 PM IST