వైకాపాలో చేరుతా: జైరమేశ్ - ap politics
ఎన్నికల్లో పోటీ చేసినా... చేయకపోయినా జగన్ పార్టీకి సేవ చేస్తానని దాసరి జైరమేశ్ పేర్కొన్నారు.
![వైకాపాలో చేరుతా: జైరమేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2461398-401-d35d885c-4e89-401e-ab65-b566d74a21a8.jpg)
మీడియాతో మాట్లాడుతున్న జై రమేశ్
హైదరాబాద్ లోటస్పాండ్లో దాసరి జైరమేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా అధినేత జగన్ను కలిశారు. త్వరలోనే వైకాపాలో చేరబోతున్నట్లు జైరమేశ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా... చేయకపోయినా పార్టీకి సేవ చేస్తానని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు. 2001 నుంచి తెదేపాకు దూరంగా ఉన్నాని... పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందించానని చెప్పారు. తెలుగుదేశం నుంచి ఏమీ ఆశించలేదని...లబ్ధి పొందలేదని తెలిపారు.
మీడియాతో మాట్లాడుతున్న జై రమేశ్