రేణిగుంటకు సీఎం..అక్కడి నుంచి శాసనసభకు! - jagan
చంద్రయాన్ -2 ప్రయోగాన్ని వీక్షించేందుకు నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఇవాళ తిరుగు పయనం కానున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు సీఎం జగన్ రేణిగుంటకు వెళ్లనున్నారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఇవాళ ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరనున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు ముఖ్యమంత్రి జగన్ రేణిగుంటకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు చెబుతారు. అనంతరం.. 10.30 గంటలకు రేణిగుంట నుంచి తిరుగుపయనమై.. 11.10 కి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి.. 11.40 కల్లా నేరుగా శాసనసభకు హాజరవుతారు.. సీఎం జగన్.