ముఖ్యమంత్రి నియంత్రణలో పనిచేసే అవినీతి నిరోధక శాఖకు డైరెక్టర్ జనరల్‌గా కొత్త అధికారిని నియమించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును ఏసీబీ డీజీగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అధికారుల కూర్పునకు కొత్త డీజీపీగా నియమితులు కానున్న గౌతమ్ సవాంగ్... పలుమార్లు జగన్‌తో భేటీ అవుతున్నారు.
ఇంటలిజెన్స్ చీఫ్‌గా తెలంగాణ పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్రతోపాటు... కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులను నియమించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో కీలకమైన అవినీతి నిరోధక శాఖకు డీజీగా కొత్త అధికారిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత... మార్పు చేర్పులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.