ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​కు ఆత్మీయ స్వాగతం... కేసీఆర్​కు ఆహ్వానం - kcr

వైకాపా అధినేత జగన్, పార్టీ ముఖ్యనేతలు హైదరాబాద్​లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కేసీఆర్​ను జగన్ ఆహ్వానించారు. అంతకుముందు రాజ్ భవన్​లో గవర్నర్ నరసింహన్​తో భేటీ అయ్యారు.

జగన్​కు ఆత్మీయ స్వాగతం

By

Published : May 25, 2019, 4:32 PM IST

Updated : May 26, 2019, 12:05 AM IST

జగన్​కు ఆత్మీయ స్వాగతం

వైకాపా అధ్యక్షుడు జగన్.. హైదరాబాద్​లో గవర్నర్ నరసింహన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను వేర్వేరుగా కలిశారు. ప్రగతి భవన్​లో కేసీఆర్ ను సతీసమేతంగా కలిశారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పనిచేద్దామని కేసీఆర్​ను కోరారు. ఈ సందర్భంగా.. తెరాస నేతలను, మంత్రులను జగన్ కు పరిచయం చేశారు. కేసీఆర్ తో పాటు, కేటీఆర్.. జగన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

అంతకుముందు.. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌... నేరుగా రాజ్​భవన్​ వెళ్లి గవర్నర్ నరసింహన్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. గవర్నర్‌ ​తో గంటపాటు సమావేశమయ్యారు. జగన్ రాకకు ముందే రాజ్​భవన్​కు చేరుకున్న వైకాపా కీలక నేత బొత్స సత్యనారాయణ... జగన్‌ను వైకాపా శాసనసభపక్షనేతగా ఎన్నుకున్న తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా.. బేగంపేట విమానాశ్రయం, రాజ్​భవన్ వద్ద వైకాపా నేతలు, జగన్ అభిమానులు సందడి చేశారు.

హైదరాబాద్ పర్యటనలో.. జగన్ వెంట వైకాపా అగ్ర నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఉన్నారు.

ఇదీ చదవండి...

ఈనెల 30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం?

Last Updated : May 26, 2019, 12:05 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details