జగన్పై దాడి కేసు విచారణ గోప్యంగా ఉంచాలని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షులు, నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యాఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై కోర్టులో జరిగే విచారణ ప్రక్రియకు సంబంధించిన విషయాలు మీడియాలో ప్రచారం చేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిష్పక్షపాత, సత్వర విచారణ జరిపేందుకే గోప్యత పాటిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకుప్రస్తుత ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది.