ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ వస్తే స్వాగతిస్తాం: చంద్రబాబు - dharamporata deeksha

భాజపాయేతర పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో.. కలిసి వస్తామంటే వైకాపాను, ఆ పార్టీ అధినేత జగన్​ను స్వాగతిస్తామని స్పష్టం చేశారు.

ధర్మపోరాట దీక్ష వేదికపై ముఖ్యమంత్రి

By

Published : Feb 11, 2019, 6:40 PM IST

జగన్ కూడా మాతో రావచ్చు-జాతీయ మీడియాతో చంద్రబాబు
కేంద్రంపై పోరాటంలో తమతో కలిసేందుకు ముందుకు వస్తే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగనే కాదు.. మద్దతుగా ఎవరొచ్చినా కలుపుకొనిపోతామని జాతీయ మీడియాతో చెప్పారు. జగన్, భాజపా ఒక్కటేనని.. గుంటూరులో మోదీ సభకు వైకాపా నేతలే జన సమీకరణ చేయడం ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే మోదీకి జగన్ మద్దతు తెలుపుతున్నారన్నారు. భాజపాయేతర పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని చెప్పారు. మోదీని ఓడించడమే లక్ష్యమన్నారు.

ABOUT THE AUTHOR

...view details