ఓదార్పు పేరుతో ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారంటూ..తెదేపా నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శించారు. మహా మేత తనయుడు జూనియర్ మేత అని విజయసాయిరెడ్డి పై మండిపడ్డారు. పైయిడ్ ఆర్టిస్ట్ కి పర్యాయపదంగా, అక్రమ సాయిరెడ్డిగా ఆయనను అభివర్ణించారు. రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులని అవమానపరిచిన మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.హెరిటేజ్ సొమ్ముతో ప్రజావేదిక కట్టారా ? అని ట్విట్టర్లో విజయసాయిరెడ్డి ప్రశ్నించగా..జగన్ ఇంటి ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి 5 కోట్లు భారతి సిమెంట్స్ నుంచి ఖర్చు చేసారా ?అని తెదేపా నాయకురాలు దివ్యవాణి కౌంటరిచ్చారు. రంజాన్ పేరుతో 6 వేల మందికి భోజనాలు పెట్టడానికి 1.1 కోట్లు సండూరు పవర్ కంపెనీ నుంచి ఖర్చుచేశారా ? అని ప్రశ్నించారు.
ఓవర్ యాక్షన్‌కి జగన్ బ్రాండ్ అంబాసిడర్ : బుద్ధా వెంకన్న - Over Action
అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. ఓదార్పు పేరుతో ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారంటూ..తెదేపా నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
బుద్ధా వెంకన్న