అమ్మ మనకు ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి ఓ రూపమిచ్చి వ్యక్తిగా తీర్చిదిద్దేది నాన్న. ఉద్యోగమని పొద్దున్నే లేచి వెళ్లే నాన్న ఇంటి పట్టున ఉండలేడు.. కడుపునిండా భోజనం చేయడు.. కంటినిండా నిద్ర కూడా పోడు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం.. కుటుంబ సౌఖ్యం కోసం ఇంటా బయటా నిరంతరం పోరాటం చేస్తూ మనకోసం నిరంతరం శ్రమించే వ్యక్తి నాన్న.
ప్రేమకు ప్రతిరూపం..
ప్రతి విజయంలోనూ వెన్నంటే ఉంటూ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ఆసరా ఇచ్చే శక్తి నాన్న. తప్పు చేసినా చిరునవ్వుతో మన్నించి సన్మార్గంలో నడిచేందుకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి నాన్న ఒక్కడే. నిస్వార్థంగా సేవలందిస్తూ.. పిల్లలకు రెక్కలొచ్చే వరకు బలం అందిస్తున్న తండ్రి... ప్రేమకు ప్రతిరూపం.