ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి శ్రమకు ప్రతిఫలం.. పరుగులెత్తిన పరి'శ్రమ' - ap industries

అడ్డగోలు విభజన.. రాజధాని లేదు. ఆదాయం రాదు... ఎలా ముందుకెళ్లాలో తెలీదు.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రంలో పారిశ్రామికరంగాన్ని కదం తొక్కించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన అనుభవాన్నే పెట్టుబడిగా పరిశ్రమలను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్​కు బ్రాండ్ అంబాసిడర్​గా మారారు. వ్యవసాయమే ఆధారంగా ఉన్న రాష్ట్రంలో... చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి పునాది వేసింది.

ముఖ్యమంత్రి శ్రమకు ప్రతిఫలం

By

Published : Apr 9, 2019, 5:06 PM IST

ముఖ్యమంత్రి శ్రమకు ప్రతిఫలం

కోరుకోని విభజనతో దిక్కుమొక్కూ లేని పరిస్థితి నుంచి... పారిశ్రామికాభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచే స్థాయికి చేరింది రాష్ట్రం. దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించింది. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 20కి పైగా దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనం. కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా, జపాన్‌కు చెందిన ఇసుజూ... మేడ్ ఇన్ ఆంధ్రా బ్రాండ్ కార్లు ఉత్పత్తి చేస్తున్నాయి. షియోమీ, సెల్‌కాన్ లాంటి ఫోన్ల తయారీ సంస్థలు ఇక్కడ తయారుచేసి ఇతరదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

పారిశ్రామిక విధానం-2020 తీసుకొచ్చిన తెదేపా ప్రభుత్వం.. పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి అనుకూల వాతావరణం కల్పించింది. ఇండస్ట్రియల్ పార్కుల పేరిట భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు భారీగా రాయితీలు ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ... మూడేళ్ల పాటు నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో 1,437 సంస్థలతో 13.35 లక్షల కోట్లు మేర పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.. 2014 నుంచి ఇప్పటి వరకు 98 వేల 894 మందికిపైగా ఉద్యోగాలు లభించాయి. ఎంవోయులు అన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చితే 24 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ అంచనా.

జపాన్ కంపెనీ నిట్టాన్ ఇండియా టెక్... ఇంజన్ వాల్వ్‌ల తయారీలో ఉంది. వీటితో పాటు అపోలో టైర్స్, హీరో మోటార్స్, టీవీఎస్ గ్రూప్, అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్డ్‌, ఎన్​హెచ్​కే స్ప్రింగ్స్ పూర్తి స్థాయిలో తయారీ మొదలుపెట్టాయి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్... ఉత్పత్తి ప్రారంభించింది. మొబైల్ ఫోన్లతో పాటు ఎల్​ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్ల తయారీలో ఉన్న డిక్సన్ కంపెనీ... పూర్తి స్థాయిలో తయారీ చేపట్టింది. వీటితో పాటు హెచ్​సీఎల్, రిలయన్స్, కండెంట్ వంటి సంస్థలు యూనిట్ల ఏర్పాటు దశల్లో ఉన్నాయి.

సింగపూర్ కంపెనీ సెంబ్ కార్ప్‌పవర్, అమెరికన్ సంస్థ సన్‌ఎడిసన్, గ్రీన్‌కో, హీరో ఎనర్జీ ఫ్యూచర్స్, రీన్యూపవర్ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభించాయి. దేశంలో 62 ప్లాంట్లు కలిగిన పెప్సికో.. రాష్ట్రంలోనూ ఏర్పాటైంది. క్యాడ్బరీస్‌, కెలోగ్స్, పార్లె, జైన్‌ఫుడ్ పార్కు, పతంజలి సంస్థలూ తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వస్త్ర తయారీ రంగంలో ప్రముఖ కంపెనీలైన అరవింద్ మిల్స్, పేజ్ సంస్థలూ ఏర్పాటవుతున్నాయి. విద్యుత్ రంగంలో తమదైన ముద్రవేసిన సుజ్లాన్, వెల్సన్‌ ఎనర్జీ సంస్థలు... ప్లాంట్లు ఏర్పాటు చేశాయి.

సాంకేతిక రంగంలో అగ్రగామి సంస్థ హాస్పిర, రీసెర్చ రంగంలో ఉన్న లారస్ ల్యాబ్స్ కూడా ఏర్పాటయ్యాయి. అరబిందోఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాయి. బెర్జర్ పెయింట్స్, రామ్‌కో సిమెంట్స్‌ తయారీ యూనిట్లు నెలకొల్పాయి. ఏషియన్ పెయింట్స్, గ్రీన్ ప్లే, టాటా కెమికల్స్, గ్రాసిమ్ కెమికల్స్, వాల్మార్ట్ రిటైల్, మహీంద్రా హాలీడేస్, వైశాలి, అదానీలు వ్యాపార విస్తరణకు రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నాయి.

పరిశ్రమలను రాబట్టడమే .. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయిస్తూ.. అన్నింటా సమతుల్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాయలసీమను ఉపాధికి ముఖ్య కేంద్రంగా మలుస్తున్నారు. దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి అయిన కియా మోటర్స్ ను వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి కలగడమే కాక.. ఆ ప్రాంతంల ఆర్థికంగా అభివృద్ధి చెందనుంది. శ్రీసిటీలో ఏర్పాటైన పరిశ్రమలతో పాటు.. తిరుపతి కేంద్రంగా అనేక మొబైల్ తయారీ పరిశ్రమలు వచ్చాయి. పెద్ద పరిశ్రమలు లేని ప్రకాశం జిల్లాకు దేశంలోనే అతిపెద్ద పేపర్ పరిశ్రమ ఆసియా పల్ప్ ను తీసుకొచ్చారు. 24వేల కోట్ల పెట్టుబడి ఈ సంస్థ పెడుతోంది. వెనుకబడిన విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటవుతోంది.

ABOUT THE AUTHOR

...view details