రామోజీ గ్రూప్ సంస్థల్లో ఈనాడు ఒక సంచలనం. ప్రారంభమైన అతితక్కువకాలంలోనే తెలుగుభాషలోనే అత్యధిక సర్కులేషన్ కలిగిన దినపత్రికగా ఆవిర్భవించి నేటికీ విజయపరంపర కొనసాగిస్తోంది. ఇక నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలను చేరవేసే మాధ్యమంగా ఈటీవీ నెట్వర్క్ పేరు ప్రసిద్ధికెక్కింది.సామాజిక మాధ్యమాల ప్రాబల్యం పెరిగిపోయిన నేటి ప్రపంచంలో నిర్దిష్టమైన వార్తా సమాచారం చాలా కీలకం. డిజిటల్ టెక్నాలజీని ఆకళింపు చేసుకుని మిలీనియల్స్‌కి నచ్చే విధంగా మీ ముందుకొస్తోంది ఈటీవీ భారత్.
వేగం, కచ్చితత్వం, విశ్వసనీయత ప్రధాన ఆయుధాలుగా డిజిటల్ వేదికపై మరో సమాచార విప్లవానికి సిద్ధమైంది ఈటీవీ భారత్. మొబైల్ యాప్‌తో పాటు వెబ్ పోర్టల్ రూపంలోనూ అలరించేందుకు సన్నద్ధమైంది. లోతైన విశ్లేషణ, నిబద్ధత కలిగిన జర్నలిస్టులున్న దేశవ్యాప్త నెట్ వర్క్ ఈటీవీ భారత్ సొంతం. సమాచారం వేగంగా అందించేందుకు అన్ని రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో అక్షరసైనికులు సదా సిద్ధం.
13 భాషలు... 29 రాష్ట్రాలు
ఒకటి కాదు రెండు కాదు... 13 భాషలు... 29 రాష్ట్రాల్లో ఈటీవీ భారత్ యాప్ అందుబాటులోకి వస్తోంది. హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, ఆంగ్ల భాషల్లో సమాచారం మీ గుప్పిట్లో ఉంటుంది. 27 ఇండిపెండెంట్ పోర్టల్స్ ఒక్క భారత్ యాప్‌లోనే లభిస్తాయి.
సూటిగా..స్పష్టంగా