జబర్దస్త్ వినోదినిపై ఇంటి యజమాని దాడి - జబర్దస్త్ వినోదిని
జబర్దస్త్ కామెడీ షోలో వినోదినిగా అలరిస్తున్న ప్రముఖ ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి జరిగింది. ఇంటి యజమానే తనపై దాడికి పాల్పడ్డాడని హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీసులకు వినోద్ ఫిర్యాదు చేశాడు.
![జబర్దస్త్ వినోదినిపై ఇంటి యజమాని దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3894878-93-3894878-1563617010811.jpg)
owner_attacked_on_jabardasth_fame_vinodhini
జబర్దస్త్ వినోదినిపై ఇంటి యజమాని దాడి
ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న జబర్దస్త్ టీవీ షో కళాకారుడు వినోద్‌పై దాడి జరిగింది. డబ్బుల వ్యవహారంలో గొడవ జరిగిందని..ఇంటి యాజమాని కావాలనే తనపై మూకుమ్మడిగా దాడి చేశారని వినోద్ వాపోయాడు. తనపై ప్రమీల, అభిషేక్, సాయిచందర్ దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు కాచిగూడ పోలీసులకు వినోద్ ఫిర్యాదు చేశాడు. 30 గజాల స్థలంలోని గోడ నిర్మాణం విషయంలో గొడవ తలెత్తిందని పోలీసులు తెలిపారు.