ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రీపోలింగ్​పై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 19న రీపోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ..తెదేపా అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం హైకోర్టు విచారణ జరిపింది. ఈసీ తరఫు న్యాయవాది అవినాష్​ దేశాయ్​ వాదనలు వినిపించారు.

By

Published : May 19, 2019, 3:28 AM IST

రీపోలింగ్​పై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నాని మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్​కు అభ్యర్థిస్తే కాళేపల్లి, కుప్పంబాదూరులో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్​ అన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని...విచారణను మూసివేసింది.
5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహణ ఉత్తర్వులను సవాలు చేస్తూ చిత్తూరు పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎన్.​శివప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టేసింది. ఈసీ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ జస్టిస్ కె.విజయలక్ష్మీతో కూడిన ధర్మాసనం శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదే..
ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అవినాష్​దేశాయ్​ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉంటాయన్నారు. వైకాపా ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అభ్యర్థిస్తే...అయిందిటిలో నిర్వహిస్తున్నామని, తెదేపా అభ్యర్థి మూడు కేంద్రాల్లో అభ్యర్థిస్తే రెండింటిలో నిర్వహిస్తున్నామన్నారు.
ఏప్రిల్​ 11న అయిదు పోలింగ్ కేంద్రాల్లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్​ను పెన్​డ్రైవ్​లో తీసుకొచ్చామని చెప్పారు. ఆ వీడియోను పరిశీలించాలని ధర్మాసనాన్ని కోరారు. నాని తరఫు న్యాయవాది జి.సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ...అవి ఏ పోలింగ్ కేంద్రంలోని ఘటనలో నిర్ధరించడం కష్టమన్నారు. దీంతో ధర్మాసనం..వీడియో చూడాలనుకోవడం లేదని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details