జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెంకటరమణలు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఇరువురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. 2003లో అనంతపురం జిల్లా జడ్జిగా పని చేశారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా అదనపు జడ్జిగా విధులు నిర్వర్తించారు. పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేసి... 2015 నుంచి ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పని చేశారు.
జస్టిస్ వెంకటరమణ 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. కొద్ది కాలం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా పని చేశారు. హైకోర్టు విభజన తర్వాత కర్నూలు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.