'ముందుగానే వీవీప్యాట్ల లెక్కింపు'.. కుదరదు: హైకోర్టు - హై కోర్టు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో.. ముందుగా వీవీ ప్యాట్లనే లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఓట్ల లెక్కింపు అంశంపై దాఖలైన పిటిషన్ మీద... హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్లు లెక్కించాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ అంశంపై... న్యాయవాది బాలాజీ వేసిన హౌస్‌మోషన్ పిటిషన్ మీద.. మంగళగిరిలోని న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌ప్రసాద్ నివాసంలో దాదాపు 5 గంటలపాటు వాదనలు కొనసాగాయి. ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగే అవకాశం లేదన్న ఈసీ తరఫు న్యాయవాది వాదనతో.. న్యాయమూర్తి ఏకీభవించారు. తక్కువ సమయం ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. పిటిషన్‌ను తోసిపుచ్చారు.