ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఏప్రిల్ 9కు వాయిదా...! - కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ భరత్ భూషణ్

వైకాపా నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు..అడ్వకేట్ జనరల్ కొంత గడువు కోరగా కేసు మంగళవారానికి వాయిదా వేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు

By

Published : Apr 4, 2019, 6:24 AM IST

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు

వైకాపా నేతలు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలున్నాయాఅని పిటీషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా ...ట్యాపింగ్ చేయాలని కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ భరత్ భూషణ్, వోడాఫోన్ నోడల్ అధికారికి పంపిన లేఖను పిటీషన్తో పాటు కోర్టుకు సమర్పించానని న్యాయవాది తెలిపారు. ఫోన్ ట్యాపింగ్కి రివ్యూ కమిటీ అనుమతి తీసుకున్నారా...తీసుకుంటే ఆ అభిప్రాయాన్ని కోర్టు ముందుంచాలని ధర్మాసనం తెలిపింది. మరోవైపు పిటీషనర్ పొందుపరిచిన లేఖ నిజమైనదో కాదో పరిశీలించాల్సి ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత గడువుకావాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరగా.... కేసు విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details