లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై దాఖలైన వ్యాజ్యం మూసివేత - లక్ష్మీస్ ఎన్టీఆర్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై దాఖలైన వ్యాజ్యానికి సంబంధించిన విచారణను హైకోర్టు మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సినిమాను విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు వ్యాజ్యాన్ని మూసివేసింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై దాఖలైన వ్యాజ్యానికి సంబంధించిన విచారణను హైకోర్టు మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సినిమాను విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు వ్యాజ్యాన్ని మూసివేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేసేందుకు అనుమతినివ్వాలని చిత్ర నిర్మాత హైకోర్టులో వ్యాజ్యం వేశారు .దీనిపై విచారణ కొనసాగించిన హైకోర్టు న్యాయమూర్తి సంబంధిత న్యాయమూర్తులతో కలిసి చిత్రాన్ని తన ఛాంబర్ లో వీక్షించారు. అయితే 10 వ తేదీన ఎన్నికల సంఘం చిత్ర పదర్శనను నిలుపుదల చేయాలని చెప్పటంతో కేసును ఈనెల 15 కు వాయిదా వేశారు. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సినిమా విడుదలపై తమకు ఎటువంటి అభ్యతరం లేదని హైకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. అందుకు భిన్నంగా చిత్ర ప్రదర్శన వద్దని తాజాగా ఏ విధంగా ఉత్తర్వులిచ్చారని ప్రశ్నించింది.