ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెలాఖరు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

రాష్ట్రంలో ఈనెలాఖరు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా  కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సిగ్మా రీసెర్చ్‌ అండ్‌  కన్సల్టింగ్‌ సంస్థకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సర్వే చేపట్టే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.

health_survey_in_andhrapradesh

By

Published : Jun 19, 2019, 8:51 AM IST

సిగ్మా అధ్యయన బృందాలు రాష్ట్రంలో ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవన విధానాలు, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య సదుపాయాలు, గర్భిణులు పొందుతున్న ఆరోగ్య సేవలు, మహిళలు, పిల్లల పోషకాహార లోపాలు వంటి అనేక అంశాల గురించిన సమాచారాన్ని సేకరిస్తారు. సర్వే చేసే సమయంలో ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఎత్తు, బరువు, రక్తపోటు, మధుమేహం, రక్తహీన పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబరు వరకు కొనసాగే ఈ సర్వేలో ప్రతి జిల్లాలోనూ సుమారు 900 కుటుంబాల నుంచి సమాచారం సేకరిస్తారని సిగ్మా సీఈఓ డాక్టరు ఉలిమిరి వెంకట సోమయాజులు తెలిపారు. ప్రజలు తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

నెలాఖరు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

ABOUT THE AUTHOR

...view details