గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు మొదలైన పరీక్ష.. మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్తయింది. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించడంతో... ఉదయం 8:30 నుంచే అభ్యర్థులు కేంద్రాలకు పరుగులు పెట్టారు. 9 గంటలనుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిచ్చారు. ముందే ప్రకటించిన ప్రకారం.. 9 గంటల 45 నిమిషాలు దాటిన తర్వాత వచ్చిన వారిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన కొందరిని సిబ్బంది వెనక్కి పంపారు. చాలా దూరం నుంచి వచ్చిన తమను పరీక్షకు అనుమతించకపోవడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 5 నిముషాలైనా అదనంగా సమయం ఇచ్చి ఉండాల్సిందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు - ap govt jobs
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-2 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. 727 కేంద్రాల్లో గ్రూపు-2 పరీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూప్-2 పరీక్షలు
77శాతం మంది హాజరు
స్క్రీనింగ్ పరీక్షకు లక్షా 77 వేల మంది హాజరయ్యారు. 77.2 శాతం అభ్యర్థులు పరీక్ష రాసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 83.42 శాతం హాజరయ్యారు. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 73.24 శాతం పరీక్ష రాశారు.
Last Updated : May 5, 2019, 5:52 PM IST