తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి.. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ - govt release notification fotr tuda chairman post
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి..ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తుడా ఛైర్మన్ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జగన్ కేబినెట్ లో చెవిరెడ్డికి మంత్రి పదవి ఖాయం అనుకున్నప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా దక్కలేదు. ఇందుకుగాను ఆయనకు తుడా ఛైర్మన్ తో పాటు విప్ పదవిని కట్టబెట్టింది వైసీపీ. గతంలోనూ చెవిరెడ్డి తుడా ఛైర్మన్ గా పనిచేశారు.