ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం - govt

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం

By

Published : Jun 11, 2019, 5:25 PM IST

Updated : Jun 11, 2019, 5:35 PM IST

ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలో తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న 15 రోజుల్లో కొత్త ఇసుక విధానం తీసుకొస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గతేడాది మైనింగ్ ద్వారా 2 వేల 643 కోట్ల ఆదాయం సమకూరగా...ఇసుక ద్వారా కేవలం 116 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. 202 ఇసుక రీచ్​లు కాస్తా..116 కు తగ్గాయన్నారు. చెన్నై, కర్ణాటకలకు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందన్నారు. మెుదటి రెండేళ్లలో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో తెదేపా నేతలు ఇసుకపై వేల కోట్లు ఆర్జించారన్నారు. ఇసుకు దోపిడీ కారణంగానే వారు ఓడిపోయారని అన్నారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Last Updated : Jun 11, 2019, 5:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details