ఈ నెల 8న ఉదయం 11 గంటల 49 నిమిషాలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజయవాడకు రానున్నారు. నూతన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి... 5 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. సాయంత్రం గేట్ వే హోటల్‌కు రానున్న గవర్నర్... రాత్రికి అక్కడే బసచేయనున్నారు. 8న ఉదయం 11 గంటల 44 నిమిషాలకు సచివాలయ ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదికకు చేరుకొని మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ దంపతులు గన్నవరం నుంచి తిరుపతి వెళ్లి... తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు.
నేడు విజయవాడకు గవర్నర్ నరసింహన్ - vijayawada
రేపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఇవాళ విజయవాడకు రానున్నారు. నూతన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
గవర్నర్ నరసింహన్