నేడు రాష్ట్రానికి గవర్నర్ రాక - amamravathi
నేడు గవర్నర్ నరసింహన్ అమరావతి రానున్నారు. రేపు వైకాపా అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు రాష్ట్రానికి రానున్నారు. రేపు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఒకరోజు ముందుగానే ఆయన రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. నేడు సాయంత్రం జగన్ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం గవర్నర్ , కేసీఆర్, జగన్‌లు ఒకే విమానంలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి బయల్దేరనున్నారు.
దుర్గమ్మ దర్శనం
ఈనెల 29 , 30 తేదిల్లో గవర్నర్ నరసింహాన్, కేసీఆర్ , డీఎంకే అధినేత స్టాలిన్ వంటి ప్రముఖులతో పాటు నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో కలసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు. దింతో ఇంద్రకీలాద్రిపై అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.