చంద్రబాబే శాసన సభాపక్ష నేతగా ఉండాలని తెదేపా ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయ పడ్డారు. ఆయన ముందుంటేనే పార్టీ నేతలకు ధైర్యముంటుందని పేర్కొన్నారు. పార్టీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్న గోరంట్ల.. సాంకేతికత కొంపముంచిందా, నేల విడిచి సాము చేశామా అనేది విశ్లేషించుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగన్ ఆహ్వానంపై ఆలోచిస్తాం: తెదేపా ముఖ్యనేత - చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబే మళ్లీ శాసన సభాపక్ష నేతగా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా... వద్దా... అనే అంశంపై ఆలోచిస్తామని చెప్పారు.
తాను గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశానన్న బుచ్చయ్య చౌదరి... అప్పుడు తన మాటలు పట్టించుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బాగు కోసం సూచనలు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంటికొచ్చి జగన్ ఆహ్వానిస్తే బాగుండేదన్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై ఆలోచిస్తామని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులు..!?