ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవరు... ఎక్కడ లెక్కింపులో పాల్గొంటారో తెలియనీయం - ఎన్నికల కౌంటింగ్

రాష్ట్రంలో ఎన్నికల లెక్కింపునకు 21 వేల మంది సిబ్బంది అవసరం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. లెక్కింపులో ఎవరు ఎక్కడ విధులు నిర్వర్తిస్తారో తెలియనీయమని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

By

Published : Apr 25, 2019, 5:15 PM IST

ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సమయంలో ఎవరు ఎక్కడ పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్తపడుతున్నామని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బంది ఎంపిక తర్వాత రెండుసార్లు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్​ల లెక్కింపు చేపడతామని వివరించారు.

మే 23న ఉదయం ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు ఉంటుందన్న ద్వివేది... కౌటింగ్ ప్రారంభమయ్యే వరకూ పోస్టల్, సర్వీసు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన... టేబుళ్ల పెంపు కోసం విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ఒక్కో టేబుల్​కు కౌంటింగ్ సూపర్​వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్​ను నియమిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదించాల్సి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details