ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి తీర్పు...అధికారానికి చేర్చు..!

గోదావరి జిల్లాలు ఏ పార్టీకి మొగ్గు చూపితే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపడుతుందన్న మాట మరోసారి నిజమైంది. గత ఎన్నికల్లో గంపగుత్తగా  తెలుగుదేశం పార్టీకి పడిన ఓట్లు....ఈసారి వైకాపా ఎగరేసుకుపోయింది. ఉభయగోదావరి జిల్లాలు మొత్తం కలిపి తెలుగుదేశానికి కేవలం 8 సీట్లే దక్కాయి. జనసేన ఒక్క సీటుకే పరిమితమైంది.

గోదావరి తీర్పు...అధికారానికి చేర్చు..!

By

Published : May 24, 2019, 6:00 AM IST

గోదావరి తీర్పు...అధికారానికి చేర్చు..!

పచ్చపార్టీదేననుకున్న పశ్చిమగోదావరిలో జగన్ పాగా వేశారు. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీకి తీవ్ర పరాభవం ఎదురైంది. కేవలం పాలకొల్లు, ఉండిలో మాత్రమే సైకిల్​ పార్టీ విజయం సాధించింది. మంత్రి పితాని సత్యనారాయణ, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ ఓటమిపాలయ్యారు. మొత్తం 15 స్థానాల్లో 13 చోట్ల ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశానికి బాగా పట్టున్న తణుకు, దెందులూరు, నిడదవోలు, నరసాపురం ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. జనసేన ప్రభావం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
తూర్పుగోదావరిలోనూ సీన్‌ రీవర్స్ అయ్యింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి 14 చోట్ల విజయం సాధించగా వైకాపా కేవలం 5చోట్ల ప్రభావం చూపింది. ఈసారి తెలుగుదేశం 4 చోట్ల విజయం సాధించగా...వైకాపా 14చోట్ల విజయ ఢంకా మోగించింది. రాజోలు స్థానం జనసేన ఖాతాలోకి వెళ్లింది. మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దపురం నుంచి విజయం సాధించగా....మండపేటలోనూ తెదేపా గెలిచింది. ఆది నుంచి తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉండే రాజమహేంద్రవరం సిటీ, రూరల్లోనూ పచ్చజెండా ఎగురవేసింది.
తునిలో మరోసారి మంత్రి యనమల రామకృష్ణుడు తన 20తమ్ముడిని గెలుపించుకోలేకపోయారు. కాకినాడ సిటీ, రూరల్లోనూ వైకాపా విజయకేతనం ఎగురవేసింది. కోనసీమ సహా, మెట్టప్రాంతాల్లోనూ ఫ్యాన్‌గాలి బాగా వీచింది. జిల్లావ్యాప్తంగా జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఊహించినా....కేవలం రాజోలులో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details