తెదేపాను వీడే ప్రసక్తి లేదు:గంటా - గంటా శ్రీనివాసరావు
కొంత కాలంగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి గంటా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించారు.
ganta_responds_on_fake_news_about_party_changing
తెదేపా నుంచి వేరే పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తాలను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. అలా ప్రసారం చేసుకునే వార్తలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు, తర్వాత ఇప్పుడు కథనాలు వచ్చాయన్న గంటా...ఎప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయని వెల్లడించారు. తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.