తెదేపా ఎంపీలు సీఎం రమేశ్, గరికపాటి మోహనరావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్ ఆ పార్టీ నుంచి వీడిపోతున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీనీ భాజపాలో విలీనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారన్న వార్తలపై చంద్రబాబు నాయకులతో చర్చించారు. పార్టీ సీనియర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో పోరాడామన్న చంద్రబాబు... పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని పేర్కొన్నారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్న తెదేపా అధినేత... భాజపా చర్యలను తీవ్రంగా ఖండించారు.