రైతు దినోత్సవం.. పింఛన్ల సంబరం - formers day celebration
రాష్ట్రం నలుమూలలా రైతు దినోత్సవాలు ఘనంగా జరిగాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని... రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.
![రైతు దినోత్సవం.. పింఛన్ల సంబరం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3778753-528-3778753-1562581989033.jpg)
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రైతు దినోత్సవాలకు ఆయా ప్రాంత ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెుదటగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరువాత పెరిగిన ఫించన్లు అర్హులైన వారందరికీ అందిచారు అధికారులు. ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వం మూత్రపిండాల వ్యాధితో బాధ పడేవారికి ప్రవేశపెట్టిన నెలకి పదివేల ఫించను లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులతో పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీనూ కచ్చితంగా నెరవేర్చుతామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పారు. కర్నూలు జడ్పీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదర్శ రైతులకు శాలువాను కప్పి ఆ ప్రాంత ఎమ్మెల్యే హహీజ్ ఖాన్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పండించిన ఉత్పత్తులను ప్రదర్శించారు.