ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడ్డెట్​కు వేళాయే... రేపు ఉదయమే మంత్రివర్గ ఆమోదం! - kurasala kannababu

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ ప్రభుత్వం రేపు ప్రవేశ పెట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయింది.

శాసనసభ

By

Published : Jul 11, 2019, 8:43 PM IST

రేపు ఉదయం సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. వైకాపా ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్​కు ఉదయం 8 గంటలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం శాసనసభలో రేపు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ... వ్యవసాయ బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తన సోదరుడి ఆకస్మిక మృతితో సభకు హాజరుకాలేకపోతున్నందున మంత్రి బొత్స వ్యవసాయ బడ్జెట్​ ప్రవేశపెడతారు. శాసనమండలిలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్​ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశ పెట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details