కేన్సర్ పై పోరాడాలి : సీఎం - క్యాన్సర్
అమరావతిలో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయండం మహత్తర కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యనించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ హబ్ గా మారుతుందని...అమరావతికి 14 వైద్య కళాశాలలు రాబోతున్నాయన్నారు.
అమరావతిలో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయండం మహత్తర కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యనించారు. ప్రపంచమంతా అమరావతి వైపు చూడలన్నదే తన అభిమతమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ హబ్ గా మారుతుందని...అమరావతికి 14 వైద్య కళాశాలలు రాబోతున్నాయన్నారు. కాలుష్య నివారణకు ప్రాధాన్యమిచ్చామన్నారు. కేన్సర్ పై పోరాడాలని వ్యాధిగ్రస్తులకు సూచించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవచ్చన్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారం కేన్సర్ తో చనిపోవడంవల్ల ఎవరికీ ఆ కష్టం రాకూడదని హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఆసుపత్రి నిర్మించారని గుర్తుచేసుకున్నారు. బసవతారకం ఆసుపత్రి నిస్వార్థంగా సేవలందిస్తోందని కొనియాడారు. కేన్సర్ పై పరిశోధనలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు.