ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీలను అణగదొక్కే  జగన్​కు అభినందనలా?'

బీసీలకు తీరని అన్యాయం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని యనమల ఆరోపించారు. తప్పుడు కేసులలో ఇరికించి బీసీలను జైళ్లకు పంపిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ex_minister_yanamala_fires_on_jagan

By

Published : Jul 21, 2019, 12:52 PM IST

Updated : Jul 21, 2019, 5:07 PM IST

తెదేపా వల్లే బీసీలు రాజకీయంగా ఎదిగారని... స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్లు ఇచ్చింది తమ పార్టీనేనని యనమల అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్ పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వల్లే మండల్ కమిషన్ సిఫారసులను నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అధికారంతో వారిని అణగదొక్కడమే వైఎస్ కుటుంబం ధ్యేయంగా పెట్టుకుందని ఆరోపించారు. అప్పుడు ఆదరణ-1ను రాజశేఖర రెడ్డి రద్దు చేస్తే... ఇప్పుడు ఆదరణ -2ను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారన్నారు.
'2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.800కోట్లు పెట్టాం. తాజా బడ్జెట్‌లో వైకాపా ప్రభుత్వం రూ.413కోట్లే పెట్టింది. బీసీలకు కోతలు పెట్టిన ప్రభుత్వాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఎలా అభినందిస్తారు..? తుడా ఛైర్మన్‌గా నరసింహ యాదవ్‌ను తొలగించి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. ఏపీఐఐసీ ఛైర్మన్ గా పి. కృష్ణయ్యను తొలగించి రోజారెడ్డిని నియమించారు. అధికారం చేపట్టి 2 నెలలు కాకుండానే ముగ్గురు బీసీలను హతమార్చారు.' అని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Jul 21, 2019, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details