రైతులను కాపాడలేక..విఫలమై మాపై నిందలా?: సోమిరెడ్డి - జగన్ ప్రభుత్వం
తమ హయాంలో ఎక్కడా విత్తనాలు, ఎరువుల కోసం రైతు రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పించలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ex_minister_somireddy_about_agriculture
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో రైతు చనిపోయారని సోమిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయంలో ఎక్కడా రాజీపడని ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. రైతులను కాపాడలేక విఫలమై మాపై నిందలు మోపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏం చెప్పారో అవి చేతల్లో చేసి చూపండని హితవు పలికారు. జాతీయస్థాయిలో వ్యవసాయ వృద్ధి అంటే అన్ని అనుబంధ రంగాల సమాహారమే అని బుగ్గన గుర్తించాలన్నారు. జాతీయ వృద్ధితో పోల్చితే ఘనమైన వృద్ధి తమ హయంలో సాధించి చూపామన్నారు.