ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ బాధ్యతల నుంచి వైదొలిగిన పునేఠాను గత ప్రభుత్వం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది.
ఎస్పీ టక్కర్ తర్వాత అనిల్ చంద్ర పునేఠా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఐపీఎస్‌ల బదిలీల వివాదంపై ఈసీ పునేఠాపై బదిలీవేటు వేసింది. దాదాపు నెలరోజుల పాటు ఎలాంటి పోస్టింగ్‌లో లేని పునేఠాను... పదవీ విరమణ కంటే 10రోజుల ముందు ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు.