ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ అమలు వల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 23 శాతం సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1850 సీట్లున్నాయి. 23 శాతం సీట్లు కేటాయింపు జరిగితే 425 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఎంబీబీఎస్ సీట్లను 2019-20 నుంచి, పీజీ సీట్లను 2020-21 విద్యా సంవత్సరం నుంచి పెంచనున్నారు. పీజీ సీట్లను పెంచాలంటే ముందుగా కాలేజీల్లో మౌళిక సదుపాయాలు, బోధకుల భర్తీ చేయాల్సి ఉంది. కొత్తగా పెరిగే సీట్లకు ఎంసీఐ పరంగా తనిఖీలు ఉండవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక సందర్భంలో సీట్ల పెంపు జరుగుతున్నందున జాతీయ వైద్యమండలి తనిఖీలు చేయట్లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని అనుసరించి ఐదు శాతం ఈడబ్ల్యూఎస్, మరో ఐదు శాతం కాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. చట్టాల రూపకల్పన సైతం జరిగింది. ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.
ఈడబ్యూసీ రిజర్వేషన్‌తో పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు! - EWS_Seats_In_MBBs
కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయటం వల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 23 శాతం సీట్లు పెరిగే అవకాశాలున్నాయి.
ఈడబ్యూసీ రిజర్వేషన్ వల్ల పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు..!
ఇవి చదవండి....నిన్న ఐఏఎస్‌లు... నేడో, రేపో ఐపీఎస్‌లు!