ఈవీఎంలు అంత సురక్షితం కావని... హ్యాక్ చేస్తే ఫలితాన్నే మార్చవచ్చని చెబుతున్న తెలుగుదేశం పార్టీ 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించాల్సిందేనని పట్టుబడుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘ వద్ద కూడా బలంగానే చెప్పింది. ఈ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం... సాంకేతిక బృందంతో వచ్చి నిరూపించాలని సవాల్ చేసింది. ఈ మేరకు తొలిదశ చర్చలు పూర్తయ్యాయి. ఇవాళ రెండోదశ సమాలోచనలు జరగనున్నాయి. ఈ భేటీకి తెలుగుదేశం పంపించే సాంకేతిక బృందంలో హరిప్రసాద్ ఉండటాన్ని ఈసీ తప్పుబడుతోంది. ఆయనపై గతంలోనే ఈవీఎంల చోరీ కేసు ఉందని సాకుగా చూపిస్తోంది. ఆయనే వస్తారని అనుమానాలు నివృత్తి చేస్తారని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది.
ఈవీఎంలపై ఎన్నికల సంఘం X తెలుగుదేశం - machines
సార్వత్రిక సమరం వేళ ఈవీఎంలపై మరోసారి గందరగోళం నెలకొంది. ఈవీఎంలను హ్యాక్ చేశారనే తెదేపా ఆరోపణలపై స్పందించిన ఈసీ... సాంకేతిక బృందంతో వచ్చి చర్చించాలని తెలిపింది. మెుదటి విడత చర్చలు అయిపోయాయి. ఇవాళ మళ్లీ భేటీ జరగనుంది.
ఈవీఎంలను హ్యాక్ చేయోచ్చా!
ప్రపంచంలోని ఏ సిస్టమైనా...హ్యాకింగ్ అవుతుందని నిపుణుల మాట. అవన్నీ కంప్యూటర్ భాషతోనే పని చేస్తాయని వాటిని డీ కోడ్ చేయవచ్చను చెబుతున్నారు. డీ కోడ్ చెయ్యాలంటే సిస్టంలకు ఉండే ఐడీ, పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయాలి. దీనికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కావాలి. హ్యాకింగ్ సాధ్యపడదని...ట్యాంపరింగ్ చెయ్యలేరని చెబుతున్నా... హ్యాకర్లు ఇలాంటి ఎన్నో వ్యవస్థల్ని ట్యాంపరింగ్ చేసి చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్లే తెదేపా పట్టుదలతో ఉంది. చంద్రబాబు ఇదే విషయంపై గట్టిగానే వాదిస్తున్నారు. 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.