ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్... అర చేతిలో ప్రపంచం!

మీడియా సామ్రాజ్యంలో ప్రభంజనం సృష్టించిన ఈనాడు గ్రూప్.. నాలుగోతరం పాత్రికేయంలో అడుగుపెట్టింది. ఒకే దేశం.. ఒకే యాప్ అంటూ 29 రాష్ట్రాలు.. 13 భాషల్లో నిరంతర వార్తలు అందించే ఈటీవీ భారత్ అప్లికేషన్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ మీ ఫోన్​లో ఉంటే.. అరచేతిలో సమస్త సమాచారం అందుబాటులో ఉన్నట్టే.

ఈటీవీ భారత్... అర చేతిలో ప్రపంచం!

By

Published : Mar 21, 2019, 11:16 AM IST

Updated : Mar 21, 2019, 4:51 PM IST

etv bharat
పాత్రికేయ ప్రపంచంలో ఈనాడు మరో సంచలనం సృష్టించింది. మూడు తరాల జర్నలిజాన్ని సమర్థంగా నిర్వహిస్తూ వచ్చిన ఈనాడు.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. 29 రాష్ట్రాలు, 13 భాషలతో.. దేశ వ్యాప్త సమాచారాన్ని ఒకే యాప్​తో ముందుకు తెచ్చింది. అఖండ భారతాన్ని ఒకే యాప్​తో ప్రజలకు అందిస్తోంది. ఒక్క క్లిక్ దూరంలో... 29 రాష్ట్రాల పోర్టల్స్ తో... సమస్త సమాచారాన్ని మన ముందుకు తెచ్చింది.

నాలుగో తరం పాత్రికేయం

ఈటీవీ భారత్... ఈనాడు సంస్థల నుంచి వేసిన మరో ప్రతిష్ఠాత్మక అడుగు. పత్రికా ప్రపంచంలో తిరుగు లేని శక్తిగా ఎదిగిన ఈనాడు.. పారదర్శక వార్తలతో ఈటీవీ ప్రసారాలు చేస్తోంది. ఈనాడు డాట్ నెట్​తో అంతర్జాలంలో వడివడిగా వార్తలు అందిస్తూ జనానికి చేరువైంది. ప్రపంచమంతా డిజిటల్ మయం అయిన ప్రస్తుత తరుణంలో.. ఒకే చేతిలో ప్రపంచపు వార్తావిశేషాలను ఈటీవీ భారత్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది.

సమస్త సమాచారం.. మీ చేతిలో..

రాజకీయం, క్రైమ్​, క్రీడ, సినిమా, బిజినెస్‌, లైఫ్​ స్టైల్​, ఫ్యాషన్‌, విద్య, సాహిత్యం, ఆధ్యాత్మికం, వంటలు, చిత్రమాలిక, వీడియోలు, దినవార ఫలాలు అన్నింటి సమాహారంగా అలరిస్తుంది. అదీ ఇదీ అని లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల వ్యవధిలో ఈటీవీ భారత్ మనకు సమస్త సమాచారాన్ని అందిస్తుంది. హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, ఆంగ్ల భాషల్లో సమాచారం ఈ యాప్​తో మన గుప్పిట్లోకి వచ్చింది. 27 ఇండిపెండెంట్ పోర్టల్స్​ ఒక్క భారత్​ యాప్​లోనే లభిస్తున్నాయి.

ఎక్కడ ఏం జరిగినా..

సూటిగా.. స్పష్టంగాప్రతి ఐదు నిమిషాలకు లైవ్ బులిటెన్ చొప్పున 24 గంటల పాటు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. టీవీ, పత్రిక మాధ్యమాల రెండింటి కలగలుపే ఈటీవీ భారత్​ ప్రత్యేకత. ఇంతటి విశిష్టమైన యాప్​ను మీరూ ఆదరించండి. డౌన్ లోడ్ చేసుకోండి. వార్తలను లైక్ చేయండి. షేర్ చేయండి. దేశాన్ని ఒక్కటి చేయండి.

Last Updated : Mar 21, 2019, 4:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat

ABOUT THE AUTHOR

...view details