'కాల్'కేయులు కేటీఆర్! - మంత్రి లోకేశ్
డేటా చోరీ వివాదంలో రాష్ట్రానికి ఏమీ నష్టం జరగలేదని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు, ప్రభుత్వ తీరు కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే పోయిందన్నారు.

''ఏపీ డేటా పోయిందని కేటీఆర్ కలగన్నారా?'' అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేశ్.. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడుకేటీఆర్ పై విమర్శలు చేశారు.పోయింది ఏపీ డేటా కాదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజేఅన్నారు. ఓటరు జాబితా సమాచారం పబ్లిక్ డేటా అని ఈసీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్స్ సంస్థపై పోలీసుల దాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు.తెదేపాకీలక సమాచారం ఇవ్వాలంటూవారం రోజుల పాటు ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను వేధించారని ఆరోపించారు.దొంగతనంగా తీసుకెళ్లిన తెదేపా డేటాతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ నుంచి.. పార్టీకార్యకర్తకి వచ్చిన ఫోన్ కాల్‌ను ట్వీట్ చేసిన మంత్రి లోకేష్... కేటీఆర్‌ను కాల్కేయుడిగా అభివర్ణించారు.