ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక.. ఓటు వేయాలంటే క్యూ అవసరం లేదు! - ap politics

పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పనిలేదు... క్యూ లైన్లో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన "మై ఓట్ క్యూ" యాప్ డౌన్​లోడ్ చేసుకుంటే చాలు... నేరుగా వెళ్లి ఓటేసి రావోచ్చు.

మై ఓట్ క్యూ

By

Published : Mar 24, 2019, 12:46 AM IST

మై ఓట్ క్యూ
చైతన్యం కలిగించి... ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకురావడానికి ఎన్నికల సంఘం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. సాంకేతికత సాయంతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు అంచనా వేసేందుకు ఓ యాప్ తీసుకొచ్చింది. ఓటరు సమయం వృథా చేసుకోకుండా... జాగ్రత్తలు తీసుకుంటోంది. మై ఓట్ క్యూ పేరిట రూపోందిచిన ఈ యాప్ ప్రయోగ దశలోనే ఆదరణ పొందుతోంది.

ఓటరు సమయం ఆదా..

పోలింగ్​ కేంద్రాల్లో లైన్లతో... పోలింగ్ శాతంపై ప్రభావం పడుతోంది. ఇది తగ్గించేందుకు ఈసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించి... ఓటు వేయించేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది. ఓటర్ల సమయం ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద వృథా కాకుండా సమయానికి వచ్చి ఓటు వేసేలా ఓ వినూత్న ఆలోచన చేసింది. మై ఓట్ క్యూ పేరిట ఓ మొబైల్ యాప్‌ సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు ఎలా ఉన్నాయో తక్షణం తెలుసుకునేందుకు వీలుగా యాప్‌ రూపోందించారు.ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీన్ని విడుదల చేసి పరీక్షించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశముందని స్పష్టం చేశారు.

డౌన్‌లోడ్ చేసుకోండిలా...

ఈ యాప్‌ మొబైల్​లో వేసుకుంటే ఓటు ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఇంకెంత మంది క్యూలో ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఏ సమయానికి ఓటు వేసేందుకు అవకాశముందో ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్​ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details